skip to main |
skip to sidebar
ఉన్నతాధికారుల టార్చర్ బరించలేక వీఆర్వో ఆత్మహత్య
వీఆర్వో ఆత్మహత్య
ఉన్నతాధికారుల టార్చర్ బరించలేకనే అంటున్నకుటుంబీకులు
నర్సాపూర్/చిలప్‌చేడ్, చరణ్ టీవీ:
మెదక్ జిల్లా నర్సాపూర్ రెవెన్యూ అధికారుల టార్చర్ కారణంగా తీవ్ర మత్తాపంచేందిన వీఆర్వో వెంకటేశం(40) సోంత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్మ చేసుకున్న సంఘటన మంగళవారం చిలప్‌చేడ్ మండలం చండూర్ లో జరిగింది. మృతుని భార్యా సువర్ణా, కొడుకు రంజిత్‌కుమార్‌ల కథనం ప్రకారం నర్సాపూర్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న వెంకటేశంను గత కొంత కాలంగా నర్సాపూర్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఇద్దరు కలిసి తీవ్రంగా టార్చర్ పెట్టడమే కాకుండా, మెదక్ జిల్లా కలెక్టరేట్‌కు అటాచ్ చేసి 8 నెలల జీతం ఆపారని రోధిస్తూ పేర్కొన్నారు. కలెక్టరేట్ నుండి ఇటీవల మృతుడు వెంకటేశంను చేగుంట మండలాలనికి బదిలీ చేసినప్పటికీ, ఇక్కడి అధికారులు సకాలంలో ఎల్పీసీ ఇవ్వకపోడంతో ఏనిమిది నెలల జీతం ఆగడంతోనే తీవ్ర మత్తాపం చెంది ఎవ్వరూలేని సమయంలో ఇంట్లో ఆత్మ అత్మకు పాల్పడ్డారని బాదితులు ఆరోపించారు. వెంకటేశం మృతికి పూర్తి బాధ్యత ఉన్నతాధికారులదే నని బాదిత కుటుంబీకులు పేర్కొన్నారు.
No comments:
Post a Comment