.

GAP Line

Main Banner

News Toolbar

Thursday 6 August 2020

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నకు జోహార్లు


జర్నలిస్టుల కోసం  శక్తి వంచన లేకుండా పోరాడిన యోధుడు...
సోలిపేట రామలింగారెడ్డి...

మెదక్ చరణ్ టీవీ(ప్రతినిధి): 
మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో.... సోలిపేట రామక్రిష్ణారెడ్డి మాణిక్యమ్మకు రామలింగారెడ్డి జన్మించాడు...  రాంచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డిలు సోదరులు కాగా... ముగ్గురు అక్కలు లక్ష్మి, విజయలక్ష్మి, సులోచనలు జన్మించారు. మంజీరా రచయితల సంఘం డాక్టర్ నందిని సిధారెడ్డి ఆధ్వర్యంలో కేసిఆర్ సమక్షంలో... 1985 లో సుజాతతో సిద్దిపేటలో ఆదర్శ వివాహాం జరిగింది. ఆయన కుమార్తె ఉదయ, కుమారుడు సతీష్ రెడ్డిలు జన్మించారు. చిన్న వయస్సులోనే మొదట ప్రజా ఉద్యమంలోకి అడుగుపెట్టిన రామలింగారెడ్డి ర్యాడికల్ భావాలు కల్గిన వ్యక్తి. వేలాది మంది విద్యార్థులు, యువకుల గుండెల్లో విప్లవాగ్నిని రగిలించిన గిరాయిపల్లి మృత వీరులు కామ్రేడ్ జనార్ధన్, మురళిమోహన్ రెడ్డి, ఆనంద్ రావు, సుధాకర్, నక్సల్బరీ శ్రీకాకుల రైతాంగాల పోరాటాలతో పాటు మంజీరా రచయితల సంఘం రామలింగారెడ్డి పై బలంగా ముద్రవేసింది. ఉదయం పత్రిక దుబ్బాక విలేకరిగా జర్నలిస్ట్ ప్రస్థావనం ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తరువాత కాలంలో వార్తా దినపత్రిక విలేకరి గా దుబ్బాక, సిద్దిపేట, జహీరాబాద్ లో పనిచేశారు. కాగా టాడా కింద 1989 లో పోలీస్ కేసు నమోదు చేసి జైలుకెల్లిన మొట్టమొదటి జర్నలిస్ట్ రామలింగారెడ్డి. తెలంగాణ వ్యవసాయమంతా కరెంట్ బావులపై ఆధారపడి ఉంది. కరెంట్ కోతలు, లో వోల్టేజ్ సమస్యల వల్ల కరెంట్ మోటార్ కాలిపోయి పంటలు అన్ని ఎండిపోతున్నాయని... తెలంగాణలో జీవనదులున్న శిశువుకు దక్కని స్థన్యంలా ప్రవహిస్తున్నాయని జర్నలిస్ట్ రామలింగారెడ్డి అనేవారు. తెలంగాణ రాష్ర్టం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న టిఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసిఆర్ కు  అన్ని విధాలుగా సహాయ సాకారాలు అందించారు. 2004 లో టిఆర్ఎస్ పార్టీలో చేరి దొమ్మాట నియోజక వర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు.  2004 నుండి నేటి వరకు ఆ పార్టీలో క్రియా శీల పాత్ర పోషించాడు. నాలుగు పర్యాయాలు ఎమ్మేల్యేగా గెలుపొందారు. అధికార పార్టీ ఎమ్మేల్యేగా ఉన్నా మావోయిస్టు ఉద్యమంలో మరణించి అసువులు బాసిన వారి గురించి పదే పదే స్పందించిన సంఘటనలు కోకొల్లలు...
దుబ్బాక ఎమ్మేల్యేగా సోలిపేట రామలింగారెడ్డి (57) బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంగా 15 రోజుల క్రితం కొంపల్లి రష్ ఆసుపత్రిలో కాలికి శస్ర్తచికిత్స జరిగింది. అది ఇన్పెక్షన్ కావడంతో హైద్రాబాద్ లోని ఏషియన్ గ్యాస్ట్రోలాజీ ఆసుపత్రి, గచ్చిబౌలిలో చికిత్స పొందుతున్నాడు. పలుమార్లు జిల్లా మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నగేశ్ రెడ్డితో పలుమార్లు మాట్లాడారు. చివరికి డాక్టర్ లు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి నిన్న రాత్రి మృతి చెందాడు.

ఉధ్యమకారున్నీ కోల్పోయాం
-  ముఖ్యమంత్రి కల్వకుంట చెంద్రశేకర్ రావు 
 ఎమ్మేల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సిఎం కేసిఆర్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సిఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని భగవంతున్ని ప్రార్థించారు.
రామలింగారెడ్డి మృతికి నివాళులు....
- అల్లం నారాయణ
 సీనియర్ జర్నలిస్ట్, ప్రజానాయకుడు సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్ర్బాంతికి గురిచేసిందని తెలంగాణ రాష్ర్ట మీడియా అకాడమిక్ చైర్మెన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ర్టంలో జర్నలిస్టుల హక్కుల పక్షాన నిలబడ్డారని, అట్లాగే పీడిత ప్రజల వైపు నిలబడ్డారని కొనియాడారు. రామలింగారెడ్డి మృతికి నివాళులర్పిస్తూ, ఆయన మరణం ప్రజలకు తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి కలుగాయని ఆయన వేడుకున్నారు.
రామన్నాకు  జోహార్లు....
- టియుడబ్ల్యూజె రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ
నిరంతరం ప్రజన పక్షపాతిగా ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పనిచేసిన  దుబ్బాక శాసన సభ్యులు... 30 ఎండ్ల స్నేహితుడు, సోలిపేట రామలింగారెడ్డి (ఆర్.ఎల్.ఆర్) ఇక లేరని ఊహించుకోలేక పోతున్నామని టియుడబ్ల్యూజె రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ తెలిపారు. ఒక పాత్రికేయుడిగా వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధనకై నాటి ఏపిడబ్ల్యూజె లో మెదక్ జిల్లా అధ్యక్షునిగా అవిశ్రాంతంగా పోరాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ముక్కుసూటి తనం ఆయన నైజం అని, ప్రజల్లో ఆయనకున్న పేరు ప్రతిష్టలు, ధైర్య సాహాసాల పట్ల ముగ్దులం అయ్యేవాలమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ర్ట వర్కింగ్ జర్నలిజం సంఘం టియుడబ్ల్యూజె పక్షాన ప్రగాడ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రామలింగారెడ్డి మరణం తీరని లోటు...
నర్సాపూర్ ఎమ్మేల్యే చిలుముల మదన్ రెడ్డి..
 తెలంగాణ రాష్ర్ట ఆవతరణ అనంతరం దుబ్బాక ఎమ్మేల్యే రామలింగారెడ్డి తో కలిసి పనిచేసామని నర్సాపూర్  ఎమ్మేల్యే చిలుముల మదన్ రెడ్డి పేర్కొన్నారు. తనకు ఆయనతో మంచి సంబందాలున్నాయని గుర్తుచేసుకొన్నారు.

1 comment:

  1. Announced the launch of its on-line on line casino app and sportsbook in Michigan in partnership with Grand Traverse Band of Ottawa and Chippewa Indians. The platform presents sports activities bettors a brand new} experience using a deep and exhaustive array of bets. The key gamers in the market market} are Kindred Group Plc., William Hill Plc., StarsGroup.com, Flutter Entertainment Plc., Betsson AB, Buffalo Partners, GVC Holdings Plc., and DraftKings Inc., among others. These main gamers are aiming to enter strategic partnerships with native manufacturers to widen their business presence worldwide. These gamers are aiming to achieve experience 로스트아크 and understand buyer requirements by way of partnerships and collaborations.

    ReplyDelete