skip to main |
skip to sidebar
లిక్కర్ వ్యాపారుల నిలువు దోపిడి
*లిక్కర్ వ్యాపారుల భహిరంగా దోపిడి
*ఉమ్మడి జిల్లాలో సిండికేట్‌గా మారిన లిక్కర్ వ్యాపారులు
*చోద్యం చూస్తున్న ఎక్సైజ్ ఆఫీసర్లు
మెదక్/సంగారెడ్డి/సిద్దీపేట, చరణ్ టీవీ:
ఉమ్మడి మెదక్,సంగారెడ్డి,సిద్దీపేట్ మూడు జిల్లాల్లో లిక్కర్ వ్యాపారులు సిండికేట్‌గా మారి, మద్యం ప్రియులను నిలువు దోపిడి చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు లిక్కర్‌ను బాటిల్ పై ఉన్న ఎంఆర్పీ ధరలకే అమ్మాలె అని పదే పదే చెడుతున్నా, లిక్కర్ సిండికేట్లు లీడర్లతో చేతులు కలిపి అడ్డగోలుగా దోచుకుతింటున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని లిక్కర్ యాజమానులు బాటిల్ ఒక్కంటికి రూ.5 చోప్పున అధిక మసూలు చేస్తూ, వినియోగదారుల జేబులకు చిల్లులు కోడుతున్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దీపేట మూడు జిల్లాలో ఇదే తంతు కొనసాగుతున్నా ఎక్సైజ్ ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడటంలేదు.భహిరంగానే అధిక ధరలు తీసుకుంటున్నా లిక్కర్ వ్యాపారులను అడిగే నాథుడే కరువయ్యారు.
No comments:
Post a Comment