.

GAP Line

Main Banner

News Toolbar

Wednesday 22 July 2020

10 కోట్ల భూమి పై కన్నేసిన రియల్ ఎస్టేట్ట్లు

గరీబోల్ల భూములు గుంజుకుంటున్న రియల్ వ్యాపారులు 

*10 కోట్ల భూమి పై కన్నేసిన వైనం 

*కౌడిపల్లి మండలం తాళ్ళగడ్డ తాండా గిరిజనుల ఆవేదన ... 

నర్సాపూర్, చరణ్ టీవీ. తాత ముత్తాతల కాలం నుండి... గీ భూములనే దున్ను కొని కుటుంబాలను నడుపుకొంటున్నం... ఇప్పుడేమో రియల్ వ్యాపారులు వచ్చి గీ భూములన్నీ మావేననీ, భూములను వదిలివెల్లాలంటూ 9 మంది గిరిజన రైతులకు నోటీసులిచ్చిండ్రని, మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తాళ్ళగడ్డ తాండాకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డికి పిర్యాదు చేశారు. కౌడిపల్లి తాశ్శగడ్డ తాండాకు చెందిన సర్వేనంబర్ 440, 444లలో బాల్యా, దుర్గ్యా, రవి, మున్యా, కాశ్యా, పాండ్యా, మున్యా, సాంల్లా, హేంమ్లాలు 1960 లోనే పట్టాలు పోంది ఉన్నామని తెలిపారు. అప్పట్లో భూమిలో బావిని తవ్వించి భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నామని బాదిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1976 సంవత్సరంలో కౌడిపల్లి మండలం ముట్రాజుపల్లి గ్రామ పంచాతీలోని తాళ్ళగడ్డ తాండాకు చెందిన సర్వేనంబర్ 440, 444లలో 9 మంది రైతులకు అసైండ్ కమిటీ ద్వారా 9 ఎకరాల ఒక్క గుంట భూమికి రెవెన్యూ శాఖా వారు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారన్నారు. ఇప్పుడేమో కొందరు రియల్ వ్యాపారులోచ్చి గీ భూములను మేము కొన్నాం వీటీని ఇడిసి పోమ్మాని, కోర్టు ద్వారా నోటీసుఇచ్చారని పలువురు బాదిత కుటుంబాలు వివరించారు.

No comments:

Post a Comment